16 April, 2026 | 11:27 AM

తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆవిష్కరణ

24-06-2025 01:35 AM

-వర్చువల్‌గా ఆవిష్కరించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీహెచ్‌ఈ)ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ.బాలకిష్టారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు ప్రొ.పురుషోత్తం, ప్రొ.మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.