15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తెలంగాణ- సరిహద్దుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

15-04-2025 12:23 AM

అక్రమంగా దేశీదారు తరలిస్తున్న నలుగురి అరెస్ట్

భీంపూర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ అఖిల్ మహహన్  ఆదేశాలతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా రు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు తీసుకొచ్చి అమ్ముతున్న నలుగురు వ్యక్తుల ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు జైనథ్ సీఐ సాయినాథ్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

భీంపూర్ మండలం అర్లి(టి) మందపల్లి గ్రామంలో దేశీదారు అమ్ముతున్నరన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏఎస్‌ఐ సిరాజ్, ముంతాజ్, కానిస్టేబుల్స్ మధుకర్, రవీందర్‌తో కలిసి దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాండ్వీ నుంచి అక్రమంగా దేశీదారు తీసుకువస్తున్న ఆత్రం లక్ష్మణ్, ఆశి ష్ జైస్వాల్, కుంబెకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణ లను అదుపులో తీసుకొనట్లు సీఐ వెల్లడించారు.

వారి వద్ద 196 దేశీదారు బాటిల్లను సీజ్ చేయడం జరిగిందని, పట్టుకున్న వారిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాగా, జిల్లాలో  ఎక్కడ దేశీదారు, పేకాట, మట్కా, గుట్కా, గంజా యి వంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామ న్నారు.  డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూనట్లు సీఐ తెలిపారు.