calender_icon.png 14 August, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రజక సంఘం జిల్లా కమిటీ రద్దు

14-08-2025 08:14:08 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రజక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం రోజున జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ హాజరై మాట్లాడుతూ, రాష్టంలో రజకుల మౌళిక డిమాండ్ల సాధన కోసం పునర్ నిర్మాణం కమిటీలను వేస్తూ రాష్టంలో 14 జిల్లా కమిటీలను చేస్తున్నామని, అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా కమిటీని రద్దు చేస్తున్నామని, వారం రోజుల్లో మండల నాయకులతో కలిసి సంఘాలు ఎన్ని ఉన్న సమిష్టిగా పోరాడేందుకు జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రొద్భాలంతో ముందుకు వెళ్తామని, రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుంకరి రాజేందర్, లింగంపల్లి సమ్మయ్య,గూడెం సమ్మయ్య, నేరెళ్ల లక్ష్మణ్, వీధిర వెంకటేష్, గంగిపల్లి రాజు, జంగాలపల్లి మహేష్ పాల్గొన్నారు.