calender_icon.png 14 August, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

14-08-2025 08:11:14 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ లష్కర్ సింగారంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రోజువారి పరీక్షలు ఆన్లైన్లో పోర్టల్ నమోదు వివరాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ మెడికల్ స్టోర్ నుంచి అందుతున్న మందుల వివరాలు పరిశీలించారు. గర్భిణి స్త్రీల అందిస్తున్న సేవలు గురించి ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సేవలను పటిష్ట పరచాలని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.