28-07-2025 12:41:35 AM
- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- కర్మన్ ఘాట్ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు
ఎల్బీనగర్, జులై 27 : ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శా ఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సతీ సమేతంగా స్వా మి వారిని దర్శించుకున్నారు. మం త్రికి అలయ ఈవో లావణ్య, ఆలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ గారు, ధర్మకర్తలు,అర్చకులు సాంప్రదాయ పూర్వక పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మా ట్లాడుతూ... కర్మన్ ఘాట్ హనుమాన్ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే దేవుడు అని అన్నారు. ఎన్నికల ముందు తాను కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో స్వామివారికి పూజలు చేశానని, నా మొక్కులు తీర్చారని తెలిపారు. నాకు మంత్రి పదవి, నా కుమారుడు ఎంపీగా గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి స్వామివారికి పూజలు చేశారని, స్వామి దయతో ఆయనే సీఎం అయ్యారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సిరిసంపదలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు చేస్తానన్నారు. కర్మన్ ఘాట్ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్మన్ ఘాట్ ఆలయాభివృద్ధికి కృషి చేయాలని ఆలయ క మిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివస్, పూల నాగరాజు, కొండ్ర సంతోష్ కుమార్, ఎనుముల రవీందర్ రెడ్డి, నారాయణ్ దుర్గా రెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.