28-07-2025 12:40:08 AM
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూలై 27:ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పేద,మధ్య తరగతి ప్రజల పిల్లలకు ఉచితంగా మంచి నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించేందుకు హాఫ్ ఆఫ్ హాంగర్ సంస్థ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యను ప్రశంసించారు.
పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడానికి నా వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలో ఉం టాయని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో హోప్ ఆఫ్ హాంగర్ వ్యవస్థాపకురాలు ఆలేఖ్య ,వెంకటేశ్వరావు శ్రీనివాసరావు,మిరయ్య,ప్రసాద్, మారేళ్ల శ్రీనివాస్, శివరాజు గౌడ్, పోతుల రాజేందర్, అనిల్, చంద్రమోహన్ సాగర్,సంపత్ తదితరులుపాల్గొన్నారు.