calender_icon.png 28 July, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు రోడ్డుపై ధర్నా

28-07-2025 12:42:01 AM

రాజన్న సిరిసిల్ల: జులై 27 (విజయక్రాంతి)న్యాయం చేయాలంటూ మృతుడి బం ధువు రోడ్డుపై ధర్నా గత నాలుగు రోజుల క్రితం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఆదరవేణి ఆలియాస్ సిర్రం వెంకటి అనే వ్య క్తి స్థానిక నందివాగు వద్ద అనుమానస్పదం గా మృతి చెందగా ఇది హత్యేనంటూ కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.వేంకటి మృతిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీ సుకోవడం లేదంటూ మృతుని బందువులు ఇందిరాచౌక్ ప్రాంతంలో ధర్నా, రాస్తారోఖో నిర్వహించారు. మాకు న్యాయం జరిగే వర కు లేచేది లేదంటూ పట్టపట్టారు.

మాకు నిం దునితో విభేదాలు ఉన్నాయని, కావాలని పతకం ప్రకారమే హత్య చేసారని మృతుని భార్య కొమురవ్వ,కుమారుడు మహేందర్, కూతురు మంజూల ఆరోపించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ శ్రీనివాస్ చేరుకొని మృ తుని బందువులకు న్యాయం జరిగేల చూస్తామని తెలపడంతో ధర్నా విరమించారు. ఎస్ ఐ ని వివరణ కోరగా మృతుడు అనుమానస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసామన్నారు. మృతునిది హత్యా లేకా ప్రమాదమా అన్న కోణాల్లో ధర్యాప్తు జరుపతున్నమన్నారు.