17-07-2025 12:00:00 AM
కార్పొరేటర్ కూరాకుల వలరాజు
ఖమ్మం, జులై 16(విజయ క్రాంతి): విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు అని 14వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు అన్నా రు.వాసిరెడ్డి సేవా సమితి వారి సహకారంతో 14వ డివిజన్ గొల్లగూడెం లోని ప్ర భుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం పు స్తకాలు అందజేశారు.హెచ్‌ఎం ప్రమీలారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 14వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ కూరాకుల వలరాజు పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా వా సిరెడ్డి సేవాసమితి వారు ప్రతి ఏడాది 20 పాఠశాలలనిఎంచుకొని పిల్లలకు కావలసిన అటువంటి మౌలిక వసతులు సమకూరుస్తున్నారని, విద్యార్థులు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. వాసిరెడ్డి సే వా సమితి సభ్యులందరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జానీ మియా, దస్తగిరి, నాగేశ్వరరావు, టీచర్స్ రవి కిరణ్, రాంప్రసాద్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.