28-12-2025 12:53:31 AM
కన్నడ స్టార్ ధనంజయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. వైశాక్ జే ఫిలిమ్స్ బ్యానర్‌పై హేమంత్ ఎం రావు దర్శక త్వంలో వైశాక్ జే గౌడ నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్‌ను పూర్తి చేసుకుందీ సినిమా. ఈ ప్రాజెక్టులో ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక మోహన్ భాగమైంది. ఈ విషయాన్ని మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు సినిమాలోని ప్రియాంక ఫస్ట్‌లుక్‌కు సంబంధించి రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఈ పోస్టర్లలో ప్రియాంక మోహన్‌ను రెట్రో స్టైల్‌లో చూపించిన దాన్నిబట్టి చూస్తే.. ఈ సినిమా టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందుతోందని తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్‌రాజ్ సంగీత సారథ్యాన్ని వహిస్తుండగా.. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఇంచారా సురేశ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.