ఆలయాలు.. మానసిక ప్రశాంతతకు నిలయాలు
- కోదండ రామస్వామి దేవాలయానికి రూ.50 వేల వితరణ
- జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య
జవహర్‌నగర్, జూలై 1 (విజయక్రాంతి): ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కోదండరామస్వామి ఆశీస్సులు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ వికలాంగుల కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామ ఆంజనేయస్వామి దేవాలయానికి బుధవారం మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో రూ. 50 వేల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని దైవ భక్తికి కొలువైన దేవాలయాలన్నారు. భక్తితోనే ఏదైనా గొప్ప కార్యాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, బిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరామ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






