13 August, 2026 | 5:12 AM

కరీంనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత

13-08-2026 12:48 AM

బీఆర్‌ఎప్ నేతల ఆందోళన, అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): కరీంనగర్‌లో మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ బండారు వేణు ఇంటిపై బుధవారం దాడికి యత్నంచిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరె స్ట్ చేశారు. ఇటీవలే కిసాస్‌నగర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తపై జరిగిన హత్యాయత్నం వివా దంలో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులను పోలీ సులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా బుధవారం ఘటన మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.

బిజెపి కార్పొరేటర్ బండారి వేణు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వివాదానికి దారి తీసింది. వేణు పో స్టింగ్‌పై ఆగ్రహించిన బిఆర్‌ఎస్ నాయకులు, గంగుల అనుచరులు ఆందోళన చేపట్టారు. బండారి వేణు ఇంటివద్ద ఆందోళనకు దిగడం, ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.