calender_icon.png 23 January, 2026 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ

23-01-2026 01:26:41 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station)లో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. రెండు గంటలుగా కేటీఆర్ ను సిట్ బృందం విచారిస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో(Former Task Force DCP Radhakishan Rao) కలిపి విచారిస్తున్నారు. వ్యాపారవేత్తలను బెదిరించి బీఆర్ఎస్ కి విరాళాలు ఇప్పించిన వ్యవహారంపై విచారిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) శుక్రవారం భారీ పోలీసు మోహరింపు మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్, జూబ్లీ హిల్స్ వద్ద నిరసనలు చెలరేగడంతో పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. 

కేటీఆర్ కి సిట్ ప్రశ్నలు

2023లో బీఆర్ఎస్ కిభారీగా విరాళాలు ఎలా వచ్చాయి? ఆ ఎలక్టోరల్ బాండ్స్ మతలబేంటి? ఎన్నికలకు ముందు 8 వేల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా.. లేదా? ప్రైవేట్ ఛానల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ అకౌంట్ లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి? రాజకీయ, ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో వాట్సాప్, సిగ్నల్ యాప్స్ లో ఎందుకు మాట్లాడారు? ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ఎందుకు తెప్పించారు?  సిరిసిల్లలో వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు? సిరిసిల్ల వార్ రూమ్ నుంచి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారా? అంటూ సిట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు.