calender_icon.png 23 January, 2026 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు

23-01-2026 12:34:33 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సిట్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ సిట్ విచారణపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అలివికాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్నో కేసులు పెట్టినా ఎదుర్కుంటున్నామని తెలిపారు.

అవినీతిని ప్రశ్నిస్తున్నామనే తమపై కేసులు పెడుతున్నారని చెప్పారు. పార్ములా-ఈ కేసులో అసలేం తేల్చారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. హామీలపై నిలదీస్తామనే ప్రభుత్వం అటెన్షన్ డైవర్ట్ చేస్తోందని పేర్కొన్నారు. 'పోలీస్ మాజీ అధికారిగా చెప్తున్నా.. ట్యాపింగ్ నేరుం కాదు'అని ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడించారు. స్వాతంత్య్రానికి ముందు కూడా ట్యాపింగ్ చేశారని తెలిపారు. దేశభద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయవద్దని చట్టమే చెప్తోందన్నారు. ట్యాపింగ్ నేరం కాదని పార్లమెంట్ సాక్షిగా మన్మోహన్ సింగ్ చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు.