calender_icon.png 14 May, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కాశ్మీర్ పహల్గం పర్యాటకులపై ఉగ్ర దాడులు అమానుషం

23-04-2025 11:25:52 PM

ఖానాపూర్  (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడులు అమానుషమని నిరసిస్తూ, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో నిరసన, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీ, నిరసన నిర్వహించారు. ఉగ్రవాదులు పర్యాటకులపై ఇలాంటి దాడులు ముక్త కంఠంతో నిరసిస్తున్నామని పలువురు వ్యక్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య ఝాన్సన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, బిజెపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్, మంత్ర రాజ్యం సురేష్, పడాల రాజశేఖర్, నాయిని సంతోష్, మని చరణ్, నేత శ్యామ్, గౌరీకర్ రాజు, పలువురు నాయకులు ఉన్నారు.