జ్యోతిష్మతిలో ముగిసిన ఎన్సీసీ
కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్
తిమ్మాపూర్, జూన్ 22 (విజయ క్రాంతి): జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సై న్స్లో గత పది రోజులుగా నిర్వహించిన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ -3 సోమవారం ము గిసింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జె సాగర్ రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జె సుమిత్ సా యి మాట్లాడుతూ జిట్స్ ఈ ప్రతిష్టాత్మక శిబిరం నిర్వహణకు ఎంపిక చేయడం గర్వకారణమని, ఇటువంటి కార్యక్రమాలు యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 9 వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ ఎ.కె. జయంత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వి. కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. అనిల్ కుమార్, డీన్ అకాడెమిక్స్, ఆడిట్ డాక్టర్ పి.కె. వైశాలి, ఎన్సీసీ అధికారులు, లెఫ్టినెంట్ జి జగదీశ్వర్, పిఐ స్టాఫ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది, క్యాడెట్లు పాల్గొన్నారు.






