20-05-2024 01:45:42 AM
నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు
మొత్తం 16 జిల్లాల్లో 80 పరీక్షా కేంద్రాలు
మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. మొదటిసారిగా టెట్ పరీక్షలను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ పరీక్షకు 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,86,386 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి టెట్ పరీక్షకు దాదాపు 40 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20, 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్ పరీక్ష, ఈ నెల 30, 31, జూన్ 1, జూన్ 2వ తేదీల్లో పేపర్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు సెషన్ 2 జరగనుంది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందే గేట్లు క్లోజ్ చేయనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందుగానే అభ్యర్థులను అనుమతించనున్నారు. మొదటి మూడు రోజులు 20, 21, 22 తేదీల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్‌కు పరీక్షలు జరగనున్నాయి.
16 జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు...
టెట్ పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరిగినప్పుడు అన్ని జిల్లాల్లో దాదాపు 2,200 వరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సారి టెట్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్ష కేంద్రాలు తక్కువగా ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 44 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 జిల్లాల్లో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం లో ఒకటి చొప్పున, హన్మకొండ కరీంనగర్ ఖమ్మం మహబూబ్‌నగర్ మేడ్చల్25, నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి సంగా రెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్‌లో ఒకటి చొప్పున సెంటర్లను ఏర్పాటు చేశారు.
టెట్ షెడ్యూల్ ఇదే...
మే 20-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్1)
మే 20-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్2)
మే 21-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్1)
మే 21-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్2)
మే 22-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్1)
మే 22-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్2)
మే 24-పేపర్2 సోషల్ స్టడీస్
(మైనర్ మీడియం) సెషన్1
మే 24-పేపర్2 సోషల్ స్టడీస్(సెషన్2)
మే 28-పేపర్2 సోషల్ స్టడీస్(సెషన్1)
మే 28-పేపర్2 సోషల్ స్టడీస్(సెషన్2)
మే 29-పేపర్2 సోషల్ స్టడీస్(సెషన్1)
మే 29-పేపర్2 సోషల్ స్టడీస్(సెషన్2)
మే 30-పేపర్1(సెషన్1)
మే 30-పేపర్1(సెషన్2)
మే 31-పేపర్1(సెషన్1)
మే 31-పేపర్1(సెషన్2)
జూన్ 1-పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్
(మైనర్ మీడియం)సెషన్1
జూన్ 1-పేపర్1(మైనర్ మీడియం)సెషన్2
జూన్ 2-పేపర్1(సెషన్1)
జూన్ 2-పేపర్1(సెషన్2)