23-07-2025 12:05:57 AM
- పేపర్ 29,043 మంది
- పేపర్ 30,649 మంది ఉత్తీర్ణత
- గతంలో కంటే పెరిగిన ఉత్తీర్ణత
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): టెట్ (తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలు విడుదలయ్యయి. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాతో కలిసి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ రమేశ్ ఫలితాలను విడుదల చేశారు. పేపర్ 61.50 శాతం మంది, పేపర్ 33.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ పరీక్షకు 47,224 మంది రాయగా, వారిలో అర్హత సాధించిన వారు 29,043 (61.50 శాతం) మంది ఉన్నారు.
పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షకు 48,998 మంది హాజరవగా, 17,574 (35.87 శాతం) మంది ఉత్తీర్ణత సా ధించారు. సోషల్ స్టడీస్ పేపర్‌కు 41,207 మంది హాజరవగా, 13,075 (31.73 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్ రెండు పేపర్లు కలిపి 90,205 మంది పరీక్ష రాయగా, అందులో 30,649 (33.98 శా తం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈఏడాది జనవరిలో నిర్వహించిన టెట్ పరీక్షా ఫలితా ల కంటే ఈసారి 2 శాతంపైగా ఉత్తీర్ణత ఎక్కువగా నమోదైంది.
ఈఏడాది జూన్ 18 నుం చి 30 వరకు మొత్తం 16 సెషన్లలో ఏడు భా షల్లో టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించారు. ఈఏడాది ఏప్రిల్ 11న విడుల చేసిన టెట్ నోటిఫికేషన్‌కు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను పా ఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఇక టీచ ర్ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గత డీఎస్సీ ము గిసిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు టెట్ నిర్వహించారు. 2024 అక్టోబర్ లో గత డీఎస్సీ ప్రక్రియ ముగియగా, 2024 నవంబర్‌లో ఒక టెట్‌ను జారీ చేసి 2025 జనవరి 2 నుండి 18 వరకు టెట్ పరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదల చేశారు.
ఈఏడాది ఏప్రిల్ 11న రెండోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేసి గత నెల జూన్ 18 నుం డి 30 వరకు పరీక్షలు నిర్వహించి జులై 22న ఫలితాలు విడుదల చేశారు. అయితే గత డీఎస్సీ సమయంలోనే మరో 6 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు రెండుసార్లు టెట్ పూర్తి కావడంతో పాత పోస్టులతోపాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు కలిపి 10 వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.