01-05-2025 12:17:57 AM
వనపర్తి, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ) : పాఠశాలలకు వేసవి సెలవులు ఈ నెల 24 నుండి జూన్ 11 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. తిరిగి జూన్ 12 వ తేదీన వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పు నః ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలను అందచేసేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు. జూన్ 12న అన్ని పాఠశాలలో పార్టీ పుస్తకాలు పంపిణీ చేసినందుకు కావలసిన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలకు యూనిఫామ్లను కుట్టిం చేందుకు దర్జీ లకు అప్పగించారు ఒక విద్యార్థికి రెండు జతల ను అందజేయనున్నారు .
రెండు రకాల మీడియంకు ఉపయోగ పడేలా పుస్తకాలు
పాఠ్య పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లీష్ వరకు తెలుగులో ముద్రించడం వల్ల అటు తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉపయోగపడేలా పుస్తకాలు ఉన్నాయి. మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను రెండు విడతల్లో అందించనున్నారు. పాఠశాలలు ప్రారంభంలో పార్ట్ 1 పుస్తకాలను తర్వాత పార్ట్ 2 పుస్తకాలను అందిం చేందుకు పూర్తి స్థాయి లో చర్యలు తీసుకుంటున్నారు.
పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్
పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై క్యూ ఆర్ కోడ్ ముద్రించారు . ఈ క్యూ ఆర్ కోడ్ ఆధారంగా ఏ మండలంలోని ఏ పాఠశాలకు ఎన్ని పుస్తకాలు పంపించారో పక్కాగా లెక్క తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠ్యపుస్తకరణ ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయు లకు అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నివేదిక. ....
యు డైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఎందుకు పుస్తకాలు అవసరం జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 358 ప్రాథమిక పాఠశాలలు, 60 ప్రాథమికోన్నత పాఠశాలలు, 99 ఉన్నత పాఠశాలలు, 3 మోడల్ పాఠశాలలు, 14 కే జీబివిలు, 5 సోషల్ వెల్ఫేర్, 2 ట్రైబల్ వెల్ఫే ర్, 3 మైనార్టీ వెల్ఫేర్, 4 మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో దాదాపుగా 47 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు విరితోపాటు కొత్తగా చేరే విద్యా ర్థులకు కూడా పుస్తకాలను అందించనున్నా రు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,60, 189 పుస్తకాల అవసరం కాగా ఇప్పటికె 1, 27, 080 పుస్తకాలు వనపర్తి జిల్లాకు వచ్చినట్లు తెలిసింది.