01-05-2025 12:18:36 AM
ఉపాధ్యాయులను అభినందించిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం లో పదవ తరగతి వార్షిక పరీక్షల లో మన యాదాద్రి భువనగిరి జిల్లా 7 వ స్థానము సాధించడం చాలా ఆనందం కలిగించిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 7 వ స్థానము కు రావడాని కృషిచేసిన జిల్లా విద్యాధికారి గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన 65 మంది విద్యార్థిని, విద్యార్థులకు సైకిల్లు అందజేసి అందజేసి వారిని వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని తెలిపారు.
జిల్లాలో మంచి పలితాలు రావడానికి తీసుకున్న చర్యలు మార్నింగ్ వేకప్ కాల్ అని ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుని ద్వారా కాల్ చేయటం జరిగింది. ప్రతి అధికారి ఒక విద్యార్థిని దత్తత తీసుకొని అ విద్యార్థి ఎలా చదువుతున్నాడు అని ప్రతి నిత్యం విద్యార్థి తో మాట్లాడుతూ విద్యార్థికి సూచనలు చేయటం జరిగిందన్నారు. ప్రతి నిత్యం జూమ్ మీటింగు ల ద్వారా మండల విద్యాశాధికారి కారులకు, ప్రధానోపాధ్యా యులకు మరియు ఉపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేయడం జరిగినది.
పదవ తరగతి చదువుచున్న వెనుకబడిన విద్యార్ధి ఇంటికి స్వయముగా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి చదువు విషయములో తగు సూచనలు ఇవ్వటం జరిగింది. *జిల్లా విద్యాశాఖాధికారికి, సిబ్బందికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్ధిని విద్యార్దులకు మరియు సహకరించిన ఇతర శాఖల అధికారులకు కలెక్టర్ అభినందించారు.