07-01-2026 05:33:56 PM
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణరెడ్డి
సదాశివనగర్,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ డా.వి.బాలకిష్టారెడ్డి సందర్శించారు. విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ సి.శోభారాణి 2016లో ప్రారంభమైన కళాశాల ప్రగతిని వారికి వివరించారు. అయన అధ్యాపకులతో మాట్లాడిన అనంతరం విద్యార్థులతో చాలా సేపు ముచ్చటించారు.
స్ఫూర్తిదాయకమైన వారి జీవిత ప్రస్థానాన్ని చెబుతూ ఉన్నత స్థితికి ఎదగడానికి లక్ష్యంతో కష్టపడడంతో పాటుగా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలన్నారు. సాంకేతికత ఒక సామాజిక అవసరమని, అది ఎంత పెరిగినా నిరుద్యోగితకు కారణం కాదని కొత్తరకం ఉద్యోగాలు వస్తూనే ఉంటాయని విషయాన్ని తెలిపారు. డాక్టర్ రవితేజ, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు మాట్లాడుతూ... విద్యార్థులు తమ చుట్టూ ఉన్న జీవితం నుంచి మంచిని ఏ విధంగా గ్రహించాలో చెప్పారు.
తమ పాటలతో పిల్లల్లో ఉత్సహాన్ని నింపారు. ఎన్నో పనుల మధ్య తీరిక చేసుకుని ప్రత్యేకంగా కళాశాలను సందర్శించి,మా అందరిలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించారని ప్రిన్సిపల్ సి.శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ సి.మీనాలతో పాటుగా అధ్యాపక బృందం, విద్యార్థులు వారికి ధన్యవాదాలు తెలిపారు.