calender_icon.png 31 July, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థాంక్యూ డియర్ ట్రైలర్ వచ్చేసింది

30-07-2025 12:28:17 AM

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ రచన దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘థాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించారు. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం ‘థాంక్యూ డియర్’ ట్రైలర్ ను విడుదల చేశారు.

ట్రైల ర్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు.  ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సం గీతాన్ని అందిస్త్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక పాట ను హీరో మంచు మనోజ్ లాంచ్ చేయగా, చిత్ర టీజర్‌ను దర్శకుడు వివి వినాయక్ లాంచ్ చేశారు.