30-07-2025 12:30:18 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర.. స్టార్స్ అందరూ పవర్ ఫుల్ లుక్స్‌లో కనిపించిన ట్రైలర్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎంతో అకట్టుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయనుంది. కాగా ‘కూలీ’ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ హడావిడి మొదలుపెట్టింది.
ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.