30-07-2025 12:26:52 AM
ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అర్జున్ చక్రవర్తి’. విజయరామరాజు హీరోగా, సిజ్జా రోజ్ హీరోయిన్‌గా నిర్మాత శ్రీని గుబ్బల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకడు విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. ‘నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్‌ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన ఓ కథ చెప్పారు.
అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసిందన్నారు. హీరో విజయరామరాజు మాట్లాడుతూ..‘టీజర్ అద్భుతంగా ఉందని చెబుతు న్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాతకి ధన్యవాదాలు’ అని అన్నారు. ‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. అందుకే ప్రొడక్షన్‌లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరిగిందని నిర్మాత శ్రీని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: విఘ్నేష్ బాస్కరన్, సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి.