calender_icon.png 1 January, 2026 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇచ్చారు.. ధన్యవాదాలు

01-01-2026 02:06:41 AM

మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): శాసన సభలో, శాసన మండలి లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఇటీవల నియమితులైన ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రా వు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, పో చంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మండలిలో విప్ దేశపతి శ్రీనివాస్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.