calender_icon.png 1 January, 2026 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర శుభాకాంక్షలు

01-01-2026 01:32:00 AM

మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, గత సంవత్సర కాలంగా బీఆర్‌ఎస్ నేతలు, శ్రేణులు పోరాడి సాధించిన విజయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో, రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ, నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో మరింత దూకుడుతో తమకు ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తుందని తెలిపారు. రైతాంగం, మహిళలు, సకల జనులు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.