15-12-2025 08:41:53 PM
మంత్రి శ్రీధర్ బాబు శ్రీను బాబు సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం
ముత్తారంలో సర్పంచ్ లకు సన్మానంలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం
ముత్తారం (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుల సహకారంతో మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా గెలిచిన మండల సర్పంచ్ లకు ఏర్పాటుచేసిన సన్మానంలో ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను 11 పంచాయతీలను గెలిపించారని, గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పాదాభివందనం చేస్తున్నట్లు సదానందం తెలిపారు. రాబోయే రోజుల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు మంత్రి అండదండలతో గ్రామాలను అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం పుట్టకు అలవాటే
మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు అసత్య ఆరోపణలు చేయడం అలవాటేనని, అ విషయం మంథని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసునని, అటూ రాష్ట్రాన్ని ఇటు నియోజకవర్గాన్ని రెండు కళ్ళల కాపాడుకుంటూ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేస్తే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి, వాత పెట్టిన కూడా పుట్ట కు బుద్ధి రావడం లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.