calender_icon.png 15 December, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

15-12-2025 08:58:05 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం పట్టణంలో గురు స్వామి పసుపునేటి నరేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహా పడిపూజకు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది అయ్యప్ప మాలధారులు భక్తిశ్రద్ధలతో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడగా, స్వామి అయ్యప్ప శరణుఘోషలతో మారుమోగింది.

సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన పడిపూజ కార్యక్రమంలో ఇరుముడి సమర్పణ, గణపతి పూజ, స్వామి దీపారాధన, హారతి వంటి పూజా విధానాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వామి పసుపునేటి నరేష్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపతో ప్రతి భక్తుడి జీవితంలో శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అయ్యప్ప మాల ధరించడం ద్వారా క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ, భక్తి భావన పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమం ముగింపులో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.