15-12-2025 08:44:51 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోటీచేసి గెలిచిన కోనేరు కోనప్ప బలపరిచిన అభ్యర్థులను సోమవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపొందిన సర్పంచ్ లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు గెలుపొందడమే కాకుండా ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి సమస్యలు పరిష్కరించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 42 మంది సర్పంచుల గెలుపుకు కృషిచేసిన కార్యకర్తలకు ,నాయకులకు, ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృతజ్ఞతలు తెలిపారు.