calender_icon.png 15 December, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకులు కాదు.. సేవకులను ఎంచుకోండి

15-12-2025 08:51:47 PM

ఎర్రజెండాతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం 

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఇంటింటి ప్రచారం

గరిడేపల్లి (విజయక్రాంతి): నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఓటు వేసి గెలిపించాలని, ప్రజలను పాలించే నాయకుడు కాకుండా సేవకుడిగా పని చేయాలని అది సిపిఎం పార్టీ ఎర్ర జెండా కార్యకర్తలతోనే సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో సిపిఎం బలపరిచిన అభ్యర్థి బోయిళ్ల కవిత నవీన్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సోమవారం రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు వృద్ధులకు యువకులకు రైతులకు నేరుగా కలిసి సిపిఎం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాల అభివృద్ధి కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోరాటాల ఫలితమే గాని సాగుతుందని గుర్తుచేశారు. ఎర్రజెండాతోనే గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పేద ప్రజలకు సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. డబ్బు మద్యం ప్రలోభవాలకు గురి కాకుండా నిజమైన నిజాయితీ గల ప్రజా సేవకులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. లక్షలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో పోటీ చేసే గెలిచాక రెట్టింపు సంపాదించుకుంటారని అన్నారు. కానీ ఎర్రజెండా అభ్యర్థులు అలా కాకుండా కేవలం ప్రజల కోసమే పని చేస్తారని చెప్పారు.

వామపక్ష ప్రజాతంత్రం లౌకిక శక్తులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ వారు గెలిస్తేనే పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారు అన్నారు. కమ్యూనిస్టులు, నీతి నిజాయితీలతో కూడిన పాలన అందిస్తారన్నారు. పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాలలో కూడా కమ్యూనిస్టు పార్టీల తరుపున పోటీ చేసిన సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు నగేష్,మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్,యానాల సోమయ్య,బోయిళ్ల అర్జున్,బోయిళ్ళ కవిత నవీన్, దోసపాటి సుధాకర్,యానాల సుశీల,మీసాల వెంకన్న,కార్యకర్తలు పాల్గొన్నారు.