22 August, 2026 | 3:01 AM

రక్తదాతలకు కృతజ్ఞతలు

14-06-2024 12:26 AM
  • గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా రక్తదానం ద్వారా అత్యం త విలువైన ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలందరికీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాతలందరూ ఏటా లక్షలాది మంది జీవితాలను కాపాడుతున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రక్తదానం ఎంతో గొప్ప విషయమని, నిస్వార్ధంతో చేసే రక్తదానం కారణంగా అనేక కుటుంబాలకు వెలుగునిచ్చినట్టు అవుతుందని చెప్పారు.

ప్రాణాపా యంలో ఉన్నవారికి రక్తదానం చేయడం ఓ పుణ్యకార్యంగా అభివర్ణించారు. రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడా ఒక్క ప్రాణం కూడా పోకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం ఈ ఏడాది థీమ్ అయిన ‘20 ఏళ్లుగా రక్తదాన సంబురాలు.. రక్తదాతలకు శుభాకాంక్షలు’ ద్వారా రక్తదానం చేసేవారి సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు చక్కని సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు.