calender_icon.png 23 September, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నినాదం సబబు కాదు

27-06-2024 12:00:00 AM

భారత పార్లమెంటులో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేసినప్పుడు చివర్లో ‘జై పాలస్తీనా’ అని నినదించడం  విచారకరం. లోక్‌సభ యంత్రాంగం ఆ పదాలను తొలగించినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక విదేశీ వ్యవహారాన్ని, దానికి సంబంధం లేని మన పార్లమెంటులో ప్రస్తావించటం అసదుద్దీన్ ఓవైసీ చవకబారుతనాన్ని బయటపెడుతోంది. మన వ్యవహారం కానప్పుడు దానిని ప్రస్తావించి ప్రచారం పొందాలనే ఇలాంటి దుగ్ధను సభ్యులు వీడాలి. అసందర్భ రాజకీయ నినానాలు చేసిన అసదుద్దీన్ ఓవైసీపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్