calender_icon.png 8 July, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కడుపు నింపడమే పండుగ సాయన్న లక్ష్యం

08-07-2025 12:10:26 AM

  1. పండుగసాయన విగ్రహానికి పూలమాలలు 

వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ జూలై 7 ( విజయ క్రాంతి) : పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా పం డుగ సాయన్న పోరాటం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం బీ ఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌బడుగుబలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పండుగ సా యన్న అని, బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో పండుగ సాయన్నకు సముచిత గౌరవం లభించిందని తెలిపారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరన్నపేటకు వచ్చినప్పుడు సాయన్న స మాధిని తొలిసారి సందర్శించి నివాళులర్పించామని గుర్తు చేశారు. 

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన సమాధిని అభివృద్ధి చేశామన్నారు. సాయన్న వారసులను గుర్తించి డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించామన్నారు. భవిష్యత్ తరలకు పండుగ సాయన్న చరిత్ర తెలియాలని ఆయన విగ్రహం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు పండుగ సాయన్న జీవిత చరిత్రపై ప్రచురించిన పుస్తకాన్ని సచివాలయంలో ఆవిష్కరించామన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రవి సాగర్, పల్లె రవి, ఆంజనేయులు గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ న ర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేశ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పార్టీ సీనియర్ నాయకులు బెక్కం జనార్దన్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, పార్టీ నాయకులు అనంత రెడ్డి, నవకాంత్, సాయిలు, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.మేరకు స్టేషన్ బెయిల్ ను పోలీస్ అధికారులు మంజూరు చేశారు.