calender_icon.png 8 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాసిల్దార్ కార్యాలయం ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

08-07-2025 12:08:31 AM

  1. నిలువరించిన మహిళ పోలీసులు

తమ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ ఆరోపణ

నాగర్ కర్నూల్ జూలై 7 (విజయక్రాంతి)కోర్టు పరిధిలో ఉన్న తమ పట్టా భూమిని అక్రమంగా ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని నిరసిస్తూ ఓ మహిళ రైతు తాసిల్దార్ కా ర్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్కర్నూ ల్ జిల్లా ఊరుకొండపేట తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఊరుకొండపేట గ్రామానికి చెందిన శశికళ అనే మహిళా రైతు సర్వే నెంబర్ 220లో తమ పట్టా భూమి వాటా విషయంలో కోర్టుమెట్లు ఎక్కరు.

కానీ కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాకముందే ఓ అధికార పార్టీ ఎంపీ పీఏ అంటూ ఓ వ్యక్తి అధికారులను బెదిరిస్తూ తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం తమకు చెందాల్సిన భూమి ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పిన వారి పేర రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. దానికి నిరసనగా కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది దీంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందిఆమెను నిలువరించి స్టేషన్‌కుతరలించారు.