08-07-2025 12:12:10 AM
శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి, జులై 07 ( విజయక్రాంతి ) : నిరుద్యోగ యువత డి ఈ ఈ టి (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్- తెలంగాణ) ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు.సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డి ఈ ఈ టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, పరిశ్రమల శాఖ అధికారి జ్యోతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్.ఎన్. అర్జున్ కుమార్, టాస్క్ మేనేజర్ సిరాజ్ తో కలిసి డిట్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ చదువుకున్న యువత తమ చదువు, నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో తెలియక నిరుద్యోగులుగా మిగిలిపోతుంటారని, అదే సమయంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతులు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడంలో వారికి ఇబ్బందులు ఉంటాయన్నారు.
అందువల్లనే ఈ సమస్యను తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగికి, పారిశ్రామిక వేత్తలకు మధ్య వారధిగా ఎ.ఐ. సాంకేతికతతో డి ఈ ఈ టి ను రూపొందించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువత అందరూ డి ఈఈటిలో లాగిన్ అయి గుర్తింపు కార్డు పొందాలని తద్వారా రానున్న 5 సంవత్సరాల్లో వనపర్తి జిల్లాలోని 10 వేల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు చేయడం జరుగుతుందన్నారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, పరిశ్రమల శాఖ అధికారి జ్యోతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్.ఎన్. అర్జున్ కుమార్, టాస్క్ మేనేజర్ సిరాజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.