24-05-2025 12:00:00 AM
బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్--3 కాలనీ సంఘం నాయకులు
ఎల్బీనగర్, మే 23 : డ్రైనేజీ పైప్ లైన్ పనులపై బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణలు అ వాస్తవమని, సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ లచ్చిరెడ్డి డ్రైనేజీ పనులు చేయిస్తున్నార ని బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్ -3 కాలనీ సంక్షేమ సంఘం నాయకులు శక్రవారం తెలిపారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ... ఫేజ్ -3 కాలనీలో శివాలయం ముందు నుంచి వేసిన డ్రైనేజీ లైన్ పై బీఆర్‌ఎస్ నాయకుడు అరవింద్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అరవింద రెడ్డి మీకు ఏమైనా రాజకీయాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, కాలనీలో చేసిన అభివృద్ధి పనులను అడ్డుకోవద్దన్నారు. డ్రై నేజీ సమస్యపై పలుమార్లు కార్పొరేటర్ కు విజ్ఞప్తి చేయడంతో, వారి సూచనల మేరకు జలమండలి అధికారులు డ్రైనేజీని నిర్మించారని చెప్పారు.
డ్రైనేజీ లైన్ మీ ఇంటి ముం దు రోడ్డుకు లింక్ ఉన్నట్లు మీకు తెలియదా? అని ప్రశ్నించారు. కార్పొరేటర్ ఇంటివద్ద డ్రైనేజీ పైపులైన్లు వేశారనే అబద్దాన్ని మీరు ప్రచారం చేయడం సరికాదన్నారు.ఒక కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మ రొకచోట జరగని పనులకు లింకు పెట్టి ప్రజ ల మధ్య వైశాల్యాలను సృష్టించడం సరికాదని సూచించారు.
సమావేశంలో బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 3 కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాయినికేతన్, ప్రధాన కార్యదర్శి భార త్ లాల్, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ కుమార్, అడ్వైజర్ సీఎం రావు, ట్రెజరర్ శ్రీనివాసరా వు, జాయింట్ సెక్రెటరీ సుమని నాయక్, కా ర్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి, మల్లేశ్ గౌడ్, సభ్యులు యాదగిరి రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.