23-05-2025 11:33:33 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రావుని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఏరియా హాస్పిటల్ లో సూపర్నెంట్గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ రెడ్డిని వైద్య విధాన పరిషత్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. 24 గంటలు గడవకముందే ఆరేవును సస్పెండ్ చేస్తూ ఉత్తర జారీచేసింది. గతంలో ఏరియా హాస్పిటల్ లో రోగులను పట్టించుకోకుండా, రోగులను అంబులెన్స్ ద్వారా ప్రైవేటు హాస్పిటల్కు తరలించడం ఆర్ఎంవో సుధాకరరావు కనుసనల్లోనే జరిగినయని ఆరోపణలు చేశారు. విచారణ చేపట్టిన వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.