03-11-2025 05:06:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరుతూ బీసీ నాయకులు సోమవారం నిర్మల్ లో అధికారులకు వినతిపత్రం అందించారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ విద్యావంతులు ఉద్యోగస్తులు ప్రజల్లో చైతన్యం నింపే బాధ్యతను భుజాలపై వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి జిల్లా సభ్యులు పాతర్ల హరీష్ ముదిరాజ్, రామగిరి రవీందర్, ప్రభాకర్, అడ్వకేట్ బోండ్ల గంగాధర్, మొగిలి రాములు, నరహరి, చిన్నయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.