calender_icon.png 27 July, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

26-07-2025 01:28:22 AM

మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, మళ్లీ మనవైపే ప్రజలు చూస్తున్నారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హ యాంలో నల్గొండ ఎలా అభివృద్ధి చెందిందో చూశామన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నల్గొండకు నీళ్లు సక్రమంగా వచ్చేవని, కేటీఆర్ నాయకత్వంలో తాము పనిచేస్తామని పార్టీ లో పెద్దఎత్తున వచ్చి చేరుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థి పోరాట ఉద్యమంలో సూర్యాపేటకు పెద్ద చరిత్ర ఉందని, విద్యార్థుల సత్తా చూపిద్దామని, మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు మీరందరూ ఆ దిశగా కృషి చేయాలని కోరారు.