calender_icon.png 26 July, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం తీసుకుంటాం-

26-07-2025 01:30:08 AM

- వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేస్తాం

- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఈ హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధిం చిన ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో వాణిజ్య ప్రతినిధులతో శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమావేమ య్యారు.

మంత్రిని కలిసిన వారిలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, కృత్రిమ మే ధ, రోబోటిక్స్, ఆరోగ్యరంగాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టం ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. వా ణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.

ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఈ కీలక మని తెలిపారు. ఈ విషయంలో ఎస్తోనియా తోడ్పాటును కోరుతున్నామని, సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని, ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్‌లో తయారైన డ్రో న్లు శత్రుదేశానికి భారీ నష్టం కలిగించాయని వెల్లడించారు.

భవిష్యత్తులో యుద్ధాలు డ్రో న్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. సెప్టెంబరులో తమ దేశాన్ని సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్‌బాబు స్పందించారు.

తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఈ ఏఐ, రోబోటిక్స్‌లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పొరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.