calender_icon.png 24 December, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ షురూ

24-12-2025 12:59:14 AM

ఇస్రో ఆధ్వర్యంలో నేడు ఉదయం నింగిలోకి

శ్రీహరికోట, డిసెంబర్ 23(విజయక్రాంతి): శ్రీహరి కోటలో ఇస్రోకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ మోసుకెళ్లే ఎల్‌వీ ఎం3-ఎం6 వ్యోమనౌక బుధవారం ఉద యం 8.54 గంటలకు నింగిలోకి ఎగరనున్నట్లు తెలిపారు. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,500 కిలోలు ఉన్నట్లు సమాచారం. స్పేస్‌పోర్ట్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తోంది.