రైతాంగాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోంది
ప్రజలకు అంతిమంగా మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే
వనపర్తి ప్రజానీకానికి మాజీమంత్రి క్షమాపణ చెప్పాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
వనపర్తి, ఏప్రిల్ 10 ( విజయక్రాంతి): రైతాంగాన్ని, ప్రజలను బిఆర్‌ఎస్ పార్టీ అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. గతంలో బిఆర్‌ఎస్ నాయకు లు కల్లబొల్లి మాటలు చెప్పి, తెలంగాణ సం పద అంత దోచుకుని ఫామ్ హౌస్ కట్టుకున్న నీచ సంస్కృతిని బిఆర్‌ఎస్ తీసుకొ చ్చిందని విమర్శించారు. శుక్రవారం కాంగ్రె స్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్యలు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏదుల రిజర్వాయర్ నుంచి ఒక్క నీటి చుక్క కూడా వనపర్తి నియోజకవర్గం రైతాంగానికి రాదని తెలిసి కూడా ప్రతిపాదించి , రిజర్వాయర్ నిర్మిస్తే వచ్చే లాభాల కోసం పాకులాడారు గానీ, ఏనాడైనా రై తాంగం కోసం ఒరగబెట్టింది ఏంటో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. నిన్న జరిగిన గొల్లపల్లి -చీర్కపల్లి రిజర్వాయర్ వద్ద బిఆర్‌ఎస్ నాయకుల అనుచరులు, వారు పురమాయించిన కొందరు లాపేక్ష కోసం దీక్ష చేపట్టింది ప్రజలందరూ గమనిస్తున్నారని వారు ఘాటుగా విమర్శించారు.
బిఆ ర్‌ఎస్ పార్టీ హాయంలో జరగని రిజర్వాయర్ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ చేస్తుంటే కళ్ళు మండి అసత్య ప్రచారాలకు తీరలేపేరని వారు మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి చేసిన కాంట్రాక్టు పనులకు.. తక్కువ సమయంలో పనులను త్వరగతిన పూర్తి చేశారని ప్రశంసించింది ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని వారు ప్రశ్నించారు.
అప్పుడు నచ్చిన మేఘారెడ్డి పై నిరాధారణమైన మాటలు బిఆర్‌ఎస్ నాయకులు మానుకోవాలని వారు హితువు పలికారు. దీక్షను విరమింప చేసేందుకు వచ్చిన హరీష్ రావు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిలు బహిరంగ సభలో గొల్లపల్లి- చీర్కపల్లి రిజర్వాయర్ ప్రస్తావన ఎంత మాత్రం మాట్లాడారో ప్రజానికమందరు గమనించారని గుర్తు చేశారు. గొల్లపల్లి చీర్కపల్లి పరిధిలో ఉన్న 200 ఎకరాల భూమిని టిఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేసిన విషయం గుట్టు రట్టైందని అందుకోసమే వారికి ప్ర యోజనం లేకుండా పోతుందని రిజర్వాయ ర్ పేరుపై రాజకీయం చేస్తున్నారని అన్నారు.
నష్టపోయిన రైతాంగానికి అందరికీ పరిహారం చెల్లించి వారి సంక్షేమం కోసం ప్రభు త్వం పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రాజెక్టు చేపట్టిన, ఎన్నో సంక్షేమం చేపట్టిన నైతికతతోనే పనిచేస్తుంది అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వాల్యానాయక్, మండల అధ్యక్షులు రవి కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎత్తం రవి, పలువురు పాల్గొన్నారు.




