25-07-2025 06:57:53 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళ కళాశాల(టీ జీ ఎస్ డబ్ల్యూ ఆర్ డీ సీ) లో దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయినట్లు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్. జి. అనూష తెలిపారు. బీఎస్సీ (ఎంపీసీఎస్), (ఎంఎస్డీఎస్), (బీజేడ్సీ), (ఎంజేడ్సీ), బీకాం (బీఏ), బీకాం(కంప్యూటర్స్ అప్లికేషన్), బి.ఏ(హెచ్ఈపీ) కోర్సుల్లో ఉన్న ఖాళీలను ఈ నెల 31 వరకు స్పాట్ అడ్మిషన్ల రూపంలో భర్తీ చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు పదవ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 2025 జనవరి తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్, ఇంటర్మీడియట్ టిసి ధ్రువీకరణ పత్రాలతో నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.