25-07-2025 06:39:59 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రధాన కార్యదర్శిగా ఊటూరి అభిలాష్ శర్మ ను నియమించినట్లు రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ, జిల్లా అధ్యక్షుడు పాతర్లపాటి నరేష్ శర్మ తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఊటూరి అభిలాష్ శర్మ మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.