calender_icon.png 26 July, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాస రచన పోటీ – సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంశంపై విద్యార్థుల సృజనాత్మకత

25-07-2025 06:50:50 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  వారి ఆధ్వర్యంలో, శ్రీ సరస్వతీ శిశుమందిర్ హై స్కూల్, కరినగర్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీకి  భారతదేశం స్వయం సమృద్ధి సాధించడం లో నేను చేయబోయే ఐదు పనులు ను ఎంపిక చేయగా, విద్యార్థులు ఆంగ్ల భాషలో తమ ఆలోచనలు అద్భుతంగా వ్యక్తపరిచారు. మొత్తం 108 మంది విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనా పరిపక్వత, భాషా నైపుణ్యం, దేశభక్తి స్పూర్తి ప్రస్ఫుటంగా కనిపించాయి.

సీనియర్ కేటగిరీ లో బొమ్మ సాయి శ్రేష్ఠ, గుంజి వైష్ణవి, గాజుల ఆశ్రిత, జూనియర్ కేటగిరీ లో మోర గ్రీష్మ, మంచికట్ల వెన్నెల మరియు చంద సాయి వ్యాస్ మొదటి మూడు స్థానాలలో నిలిచి బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సముద్రాల రాజమౌళి మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, దేశం పట్ల బాధ్యతను పెంపొందిస్తాయి. భవిష్యత్ నాయకులైన ఈ విద్యార్థులు తమ ఆలోచనల ద్వారా స్వయం సమృద్ధి దిశగా దేశాన్ని నడిపించే శక్తి కలిగి ఉన్నారు అన్నారు. పోటీ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన టీచర్లకు మరియు ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు.