27-11-2025 12:16:20 AM
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాం గం, సామాజిక న్యాయం సూత్రాలను బిజెపి ప్రభుత్వం ద్వంసం చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం హైదరాబాద్ లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని డాక్టర్ దిడ్డి సుధాకర్ ఎగురవేశారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కఠినమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యల ద్వారా బిజెపి ప్రభుత్వం భారత సమాఖ్య నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం సమాఖ్య వాదాన్ని క్రమబద్ధంగా కూల్చివేయడం ద్వారా భారతదేశ ఐక్యత, సమగ్రతకు తీవ్ర ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు.
భారత రాజ్యాంగాన్ని మనుస్మృతితో భర్తీ చేయాలనే తమ దీర్ఘకాల ఎజెండాను బిజెపి అనుసరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర నాయకులూ బుర్ర రాము గౌడ్, విజయ్ మల్లంగి, జస్వత్ రెడ్డి, మజీద్, జావేద్ షరీఫ్, అజీజ్ బేగ్, షాబాజ్, దర్శనం రమేష్, కొడంగల్ శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, ఎస్‌ఎన్ రెడ్డి, డా. మీర్జా, లియాఖత్ ఖాన్, కుతూబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.