31-01-2026 02:05:21 AM
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో సీఎం పాల్గొన్న ‘లీడర్‌షిప్ ఇన్ ది 21వ సెంచరీ కేయాస్, కాన్లెక్ట్ అండ్ కరేజ్ ’ ఎగ్జిక్యూటీవ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శిక్షణను పూర్తిచేసిన సందర్భం గా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్‌రెడ్డికి సర్టిఫికెట్ ప్రదానంచేశారు. అధికారంలో ఉండగా నే ఐవీ లిగ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయ ముఖ్య మంత్రిగా రేవంత్‌రెడ్డి రికార్డు సృష్టించారు.
ఈ ప్రోగ్రామ్‌లో రేవంత్‌రెడ్డితోపాటు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా తరగతులు జరిగాయి. మ సాచ్‌సెట్స్‌లో ప్రస్తుతం వీస్తున్న మంచు తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 15 నుంచి మైనస్ 24కు పడిపోయాయి.
ఇంత టి ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం విరామం తీసుకోకుండా తరగతులకు హాజరయ్యారు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అధికార విశ్లే షణ, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వా రా శిక్షణ పొందారు.