31-01-2026 02:13:40 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో/ కరీంనగర్, జనవరి 30 (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌష్ ఆలంను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం చివరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి క్షమాపణతో ముగిసింది. విధుల్లో ఉన్న ఒక ఐపీ ఎస్ అధికారిపై మతపరమైన ఆరోపణలు చేయడంపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడటం, పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం తో ఎమ్మెల్యే దిగివచ్చారు.
తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తీవ్రమైన ఒత్తిడిలో నోరు జారానని పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, పోలీస్ వర్గాల్లో పెను సంచలనంగా మారిం ది. ఈ వివాదం శుక్రవారం వీణవంక మండ ల కేంద్రంలో ప్రారంభమైంది. జాతర ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న విజయానంద్‌రెడ్డితో కౌశిక్‌రెడ్డికి విభేదాలు ఉండటంతో ఇరువర్గాల మధ్యల గొడవలు జరిగే సూచనలు కనిపించడంతో పోలీసులు కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిం ది. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే, సీపీ గౌష్ ఆలంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీ సులు ఆయనను అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తమై, పార్టీ శ్రేణులను పోలీస్ స్టేషన్ వద్దకు పంపారు.
చివ రకు శుక్రవారం రాత్రి 10:20 గంటల ప్రాం తంలో పోలీసులు ఆయనను విడుదల చేశా రు. మరోపక్క కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఒక అధికారి మ తం పేరు ప్రస్తావించడం, మత మార్పిడులం టూ నిరాధారమైన ఆరోపణలు చేయడం సివిల్ సర్వీసెస్ గౌరవాన్ని దెబ్బతీయడమేనని డీజీపీ శివధర్‌రెడ్డి నేతత్వంలోని అసోసి యేషన్ ధ్వజమెత్తింది.
ఎమ్మెల్యే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు, కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. చట్టపరమైన ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉండటంతో ఎమ్మె ల్యే స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చెప్పినప్పటికీ, ఇప్పటికే నమోదైన కేసుల విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.