calender_icon.png 31 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక వ్యవస్థను శాసించేది నైపుణ్యమే!

31-01-2026 02:11:17 AM

  1. తెలంగాణ యువతే గ్లోబల్ వర్క్ ఫోర్స్
  2. అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా.. స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రభుత్వ ప్రత్యేక ఫోకస్
  3. ఫీస్టా 2026 సదస్సులో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): రాబోయే కాలంలో ప్ర పంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించేది కేవలం కూడబెట్టిన మూలధనం కాదని, మానవ వనరుల్లో ఉండే అసాధారణ నైపుణ్యం మాత్రమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. తెలంగాణ యువతను కేవలం స్థానిక అవసరాలకే పరిమితం చేయకుం డా, అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌కు అనుగుణంగా గ్లోబల్ వర్క్ ఫోర్స్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్డ్ స్ట్రాటజీస్ ఇన్ టాలెంట్ ఆక్విజిషన్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువతలో ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని మంత్రి వివరించారు. భారత వృద్ధి రేటు సుమారు 7 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేయడం శుభపరిణామమన్నారు.

ఏఐని చూసి భయం వద్దు.. వినియోగించుకోవాలని, ఇందుకు సంస్థలు రూపాంతరం చెందాలని శ్రీధర్‌బాబు సూచించారు. కేవలం ఉద్యోగాలను సష్టిం చే రాష్ర్టంగానే కాకుండా, అంతర్జాతీయ పరిశ్రమలకు భవిష్యత్ భాగస్వామిగా తెలంగాణను నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాష్ర్టంలో అత్యుత్తమ మానవ వనరులను రూపొందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఏఐ వర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐకాం, లైఫ్ సైన్సెస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ భవిష్యత్తులో గ్లోబల్ టాలెంట్ హబ్‌లుగా మారతాయన్నారు. నైపుణ్యాల కేరాఫ్ అడ్ర స్ తెలంగాణేనన్నారు. సోషల్ టాలెంట్ ఫౌండర్ జానీ క్యాంప్ బెల్, క్యారలాన్ గ్లోబల్ సొల్యూషన్స్ ఎండీ పవన్ సచ్ దేవా, క్రౌడ్ స్ర్టైక్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మీనన్, ప్రముఖ నటి మందిరాబేడీ, ఫీస్టా 2026 ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు హరికష్ణ, కష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని టాలెంట్ అక్విజిషన్ రం గంలో వస్తున్న మార్పులపై చర్చించారు.