05-01-2026 12:02:34 AM
ఘట్‌కేసర్, జనవరి 4 (విజయక్రాంతి) : అనారోగ్యానికి గురైన నిరుపేదలకు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలబడుతుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వైరస్ యాదవ్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ పట్టణంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన సూర్యదేవ్ మోరేకి అనారోగ్య రీత్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 55వేలు మంజూరి కావడంతో అట్టి చెక్కును ఆదివారం మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు మేడ్చల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా లబ్ధిదారుకు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ సర్పంచ్ లు అబ్బసాని యాదగిరియాదవ్, మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కుతాడి రవీందర్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, ఈ డబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవ పట్నం ఆంజనేయులు, సెక్రటరీ శశిధరన్, నాయకులు సోమసాని వెంకటేష్ , సార శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి సురేష్, గోరకంటి రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.