05-01-2026 12:03:08 AM
లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేత
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత జరిగే గృహ ప్రవేశం కార్యక్రమం కు నేరుగా హాజరు కావడం తో పాటు పుట్టింటి నుండి ఇచ్చే చీర సారె మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తన స్వంత ఖర్చులతో గృహ ప్రవేశ లబ్ధిదారులకు చీర సారె ను అందిస్తూ వారి కుటుంబంలోని వ్యక్తిగా ఎమ్మెల్యే వారికి చెరిగి పోనీ జ్ఞాపకంగా నిలుస్తున్నారు.
వనపర్తి, జనవరి 4 (విజయక్రాంతి) : పేద, మధ్య తరగతి కుటుంబాలకు స్వంత ఇల్లు ఉండలన్నది ఒక జీవిత ఆశయం లా కల ఉంటుంది అలాంటి వారి కలలాగా మిగిలి పోకుండా ఉండ వద్దనే ఉదేశ్యంతో వేడి నీళ్లకు చల్ల నీళ్లు లాగా ఇంటికి అయ్యే నిర్మాణం ఖర్చు లో తమ వంతు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మూడు విడతల్లో రూ 5 లక్షలను అందచేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కావడం తో నిరుపేద, మద్య తరగతి కుటుంబాలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకుని నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు కూడా చేస్తున్నారు.
ఎమ్మెల్యే చీర సారె..
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు ఎంపికైన వారు ఇండ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేయడం ఆయా గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలలో తెలిసిన నాయకుడు మనవాళ్ళు మీరు తప్పకుండా రావాలన్న కోరిక మేరకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు హాజరు అవుతుంటారు. కానీ వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాత్రం విన్నుతన ఆలోచన విధానంలో ముందుకు సాగుతున్నారు. మన కుటుంబంలో ఉన్న ఆడబిడ్డ ఓ ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ కార్యక్రమంకు వెళ్లిన సందర్బంగా చీర సారెను ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. నియోజకవర్గంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం చేసుకుని గృహ ప్రవేశం చేస్తున్న ప్రతి లబ్ధిదారుని ఇంటికి నేరుగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హాజరు కావడం తో పాటు తన ఆడబిడ్డ అనుకుని చీర సారె ను అందిస్తూ వారితో కలిసి భోజనం చేసి ఎమ్మెల్యే తన ఆప్యాయత ను చూపుతుండండంతో ఒక తీపి జ్ఞాపకంగా నిలుస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలే నా ఆత్మీయులు..
నియోజకవర్గ ప్రజలందరు నా ఆత్మీయులు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. మంజూరు అయిన ప్రతి ఇంటికి వారి బిడ్డగా నా వంతు బాధ్యతగా చీర సారె కార్యక్రమం ద్వారా పంపిణి చేస్తున్నా.
- తూడి మేఘా రెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు